కరోనాకు మరో టాబ్లెట్..  ఫబిఫ్లూ 400 ఎంజీ రెడీ

త్వరలో మార్కెట్లోకి…

హైదరాబాద్‌‌, వెలుగు: ఓరల్‌‌ యాంటి వైరల్‌‌ డ్రగ్‌ ఫబిఫ్లూను 400 ఎంజీ వెర్షన్‌ లో తీసుకురావాలని ఫార్మా కంపెనీ గ్లెన్‌ మార్క్‌‌ చూస్తోంది. ఫబిఫ్లూను తక్కువ కరోనా ఎఫెక్ట్‌‌ ఉన్న పేషెంట్ల ట్రీట్‌మెంట్‌ కోసం వాడుతున్నారు. ప్రస్తుతం ఈ డ్రగ్‌ 200 ఎంజీ వెర్షన్‌ లో అందుబాటులో ఉంది. 400 ఎంజీ ఫబిఫ్లూ ట్యాబ్లెట్‌ ధరను కంపెనీ ప్రకటించలేదు. ట్యాబ్లట్‌ స్ట్రెంథ్‌ పెంచడంతో పేషెంట్లు రోజుకి తక్కువ ట్యాబ్లె ట్లనే తీసుకోవడానికి వీలుంటుందని గ్లెన్‌మార్క్‌‌ ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. కొత్త 400 ఎంజీ వెర్షన్‌ వలన పేషెంట్లు మొదటి రోజు 9 ట్యాబ్లెట్లు (ఉదయం 4.5, సాయంత్రం 4.5) తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత నుంచి కోర్స్‌‌ పూర్తయ్యే వరకు రోజుకి రెండు ట్యాబ్లెట్లు తీసుకోవాలి. గురువారం సెషన్‌ లో గ్లెన్‌ మార్క్ షేరు 3.34 శాతం పెరిగి రూ. 462.50 వద్ద క్లోజయ్యింది.

Latest Updates