రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. రాష్ట్రవ్యాప్తంగా 3.1 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనంలో తీవ్రత ఎక్కువగా హైదరాబాద్‌ పరిధిలోనే ఉందని, అందుకే ఈ నెలలో ఆ ప్రాంతంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయని తెలిపారు.  దీంతో చేపల వేటకు వెళ్లే మత్య్సకారులు, రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు అధికారులు. ఇప్పటికే కురుస్తున్న వర్షాలకు ముంపు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.

వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రాష్ట్రంలో 14 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, 11 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. ఈ సీజన్‌లో శనివారం నాటికి 106.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ఈ సీజన్‌లో రాష్ట్రంలో లోటు వర్షపాతం ఉన్న జిల్లాలు లేవని చెప్పింది వాతావరణ శాఖ.

Latest Updates