తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు వర్షాలు!

రానున్న రెండురోజుల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతోకూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. హిందూ మహాసముద్రం, దక్షిణ-ఆగ్నేయ బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని వివరించింది. గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో పాటు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

 

Latest Updates