ఏపీలో మావోయిస్టు కార్యకలాపాలపై మరో ఏడాది పాటు నిషేధం

ఆంధ్రప్రదేశ్ లో మావోయిస్టు పార్టీ, దాని కార్యకలాపాలపై మరో ఏడాది పాటు నిషేధం విధించింది.  దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ నిషేధం ఆగస్టు 17 నుంచి  ఏడాది పాటు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ భద్రతా చట్టం ప్రకారం నిషేధం పొడిగిస్తున్న‌ట్లు ఉత్తర్వుల్లో తెలిపింది. అంతేకాదు మావోయిస్టు పార్టీ అనుబంధ సంస్థ రివల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ పైన కూడా మరో ఏడాది పాటు ఏపీ ప్రభుత్వం నిషేధం విధించింది.

Latest Updates