బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కారుపై దాడి

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ వాహనంపై అదివారం రాత్రి ఇద్దరు యువకులు దాడి చేశారు. కరీంనగర్ రూరల్ మండలం గోపాల్ పూర్ లో బండి సంజయ్, ఎంపీటీసీ అభ్యర్థి మహేందర్ లు ప్రచారం చేస్తున్నా రు. సంజయ్ ను శివారెడ్డి అనే వ్యక్తి దూషిస్తూ చెప్పుతో దాడి చేయగా పార్టీ శ్రేణులు అతడిని కొట్టారు. ప్రచారం ముగించుకుని వెళ్తున్న సంజయ్.. దుర్శేడ్ వద్దకు రాగానే ఇద్దరు వ్యక్తులు ఆయన కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు ప్రయత్నించారు. దాడి చేసిన వారు శివారెడ్డి కొడుకు వంశీ, మణిగా అనుమానిస్తున్నారు. శివారెడ్డి కరీంనగర్ రూరల్ మండలం బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశా రు. ఎంపీటీసీ టికెట్ విషయంలో విభేదాలు రావడంతో పార్టీ నుంచి తొలగించారు.

Latest Updates