మేము అడిగే ప్రతీ ప్రశ్నకు సమాధానమివ్వాలి:  సుప్రీం

ఆర్టికల్ 370 ను రద్దు చేసిన తరువాత జమ్మూ కాశ్మీర్ లో విధించిన ఆంక్షలపై లేవనెత్తిన ప్రతి ప్రశ్నకు స్పందించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ఆ రాష్ట్ర పాలనా యంత్రాంగాన్ని ఆదేశించింది.   జమ్ము కాశ్మీర్‌లో ఆంక్షల విధింపును సవాల్‌ చేస్తూ పిటిషనర్లు వివరంగా వాదించారని,   ఆ ప్రశ్నలకు రాష్ట్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సమాధానం చెప్పాల్సి ఉంటుందని జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది.

” మిస్టర్ మెహతా.. పిటిషనర్లు సవాల్ చేసిన ప్రతి ప్రశ్నకు మీరు సమాధానమివ్వాలి. మీరు కౌంటర్ చేసిన అఫిడవిట్  ఆంక్షల అంశంపై మేము ఓ నిర్ణయానికి రావడానికి ఆ అఫిడవిట్  ఏ విధంగానూ సహాయపడదు. మీరు ఈ అంశంపై తగినంత శ్రద్ధ పెట్టడం లేదన్న అభిప్రాయాన్ని మాకు కలిగించవద్దు ” అని  లాయర్లు ఆర్ సుభాష్ రెడ్డి, బిఆర్ గవైలతో కూడిన ధర్మాసనం తుషార్ మెహతాకు తెలిపింది.

Answer every question raised on Kashmir restrictions: Supreme Court to J&K administration

Latest Updates