హాంకాం గ్ లో అల్లర్లు

  • రోడ్లను బ్లాక్ చేసిన ఆందోళనకారులు
  • ఎయిర్ పోర్టుకు బస్సు, ట్రైన్ సర్వీసులు రద్దు

హాంకాంగ్ లో నిరసనలు ఆదివారం హింసాత్మకంగా మారాయి. శనివారం రాత్రి ఆందోళనకారులపైకి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడంతోఉద్రిక్తత నెలకొంది. పేరొందిన నేతల అరెస్టుపైనా ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తంచేశారు. రోడ్లపై బీభత్సం సృష్టించారు. టైర్లు, ఇతర వస్తువులను రోడ్లపైకి తెచ్చి నిప్పంటించారు. ఆదివారం ఉదయం వందలాది మంది నిరసనకారులు ఎయిర్ పోర్టుకు వెళ్లే దారులను బ్లాక్​చేశారు. ఎయిర్ పోర్ట్​ ఆవరణలోని బస్ స్టేష న్ లో బారికేడ్లుగా నిల్చుని బస్సులను అడ్డుకున్నారు. గొడుగులను ఉపయోగించుకుని సీసీ కెమెరాల నుంచి తప్పించుకుంటున్నారు. ఆందోళనల నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం నుంచి సర్వీసులను నిలిపేస్తున్నట్లు ఎయిర్ పోర్ట్​ ఎక్స్​ప్రెస్ ట్రైన్ ప్రకటించింది. విమానాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ఎయిర్ పోర్టులో ప్రభుత్వం ప్రత్యేక బలగాలను మోహరించింది. ఎయిర్ పోర్టులోకి ప్రవేశించొద్దని ఆందోళనకారులను కోర్టు గతంలోనే హెచ్చరించింది. దీనికి సంబంధించి ఇంజక్షన్ ఆర్డర్ కూడా వెలువరించింది. దీంతో నిరసనకారులంతా ఎయిర్ పోర్టుకు దగ్గర్లో ని రోడ్లను బ్లాక్​చేశారు. ర్యాలీలు, ఆందోళనలపై అధికారికంగా బ్యాన్ ఉన్నా.. నిరసనకారులు లెక్కచేయడంలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మూడు నెలలుగా ఈ ఆందోళనలు సాగుతున్నాయి.

Latest Updates