48గంటల్లో కరోనాను చంపే ఔషదం..!

కరోనా వైరస్ ( కోవిడ్ – 19 ) ను 48గంటల్లో చంపే డ్రగ్‌ను ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు కనుగొన్నట్లు ఆ దేశ వార్తా పత్రికలు ప్రచురించాయి. ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్సిటీకి చెందిన కైలీ వాగ్‌స్టాఫ్ నేతృత్వంలో ‘ఐవెర్‌మెక్టిన్’ అనే ఔషదం కరోనా వైరస్‌ను రెండు రోజుల్లో నాషనం చేసిందని ఆమె తెలిపారు. ఈ మెడిసిన్ ఇప్పటికే పలు రకాల ఇన్‌ఫెక్షన్ల నివారణకు వాడుతున్నారని ఆమె చెప్పారు. ఒక డోస్‌తో వైరస్‌కు సంబంధించిన ఆర్ఎన్ఏను 48గంటల్లో పూర్తిగా నిర్మూలించవచ్చని అన్నారు. అయితే ఈ ప్రయోగాన్ని ల్యాబ్ లో మాత్రమే చేశామని, మానవులపై పరీక్షించాల్సి ఉందని కైలీ వాగ్‌స్టాఫ్ చెప్పారు. మనుషులపై ఎంత డోస్ ఇస్తే పనిచేస్తదో తెలియడానికి మరింత సమయం పడుతుందని ఆమె అన్నారు. అయితే ప్రస్తుత ప్రపంచం కరోనాతో బాధపడుతుందని దీన్ని ఎదుర్కోవడానికి మరే మందులేదని అయితే ఐవెర్‌మెక్టిన్ పై మరిన్ని పరిశోధనలు చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఆమె చెప్పారు. ఈ పరిశోధనా వివరాలను యాంటీవైరల్ రిసెర్చ్ జర్నల్‌లో ప్రచురించారు. కరోనాపై ఐవెర్‌మెక్టిన్ ఎంతవరకు పనిచేస్తుందో తెలువకపోయినా ప్రస్తుతం ఇది తప్పవేరే దారి కనపడటంలేదని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు తెలిపారు.

Latest Updates