బ్లాక్‌ మార్కెట్‌లో యాంటీ డోట్ సేల్స్‌.. నిందితులను పట్టుకున్న ఎస్‌ఓటీ

హైదరాబాద్: కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న దృష్ట్యా దీన్ని అదనుగా తీసుకొని వైరస్‌ డ్రగ్స్‌ పేరుతో పలువురు మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని ప్రజలను పోలీసులు హెచ్చరిస్తున్నారు. తాజాగా యాంటీ వైరల్ డ్రగ్ అమ్మకానికి సంబంధించి పోలీసులు మరో ముఠాను కస్టడీలోకి తీసుకున్నారు. కరోనా యాంటీ వైరల్ డ్రగ్‌ను బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతున్న ముఠాను పోలీసులుకు పట్టుకున్నారు. ఫేవిఫిరావిర్ ట్యాబ్లెట్‌తో పాటు రెమిడిసివిర్‌‌ ఇంజక్షన్స్‌ను ఎక్కువ ధరలకు అమ్ముతున్న నలుగురిని మల్కాజ్‌గిరి స్పెషల్‌ ఆపరేషన్ టీమ్ (ఎస్‌ఓటీ) పోలీసులు అరెస్ట్‌ చేశారు. మార్కెట్‌లో రూ.5,500కు ధర పలికే రెమిడెసివిర్‌‌ ఇంజక్షన్‌ను రూ.30 వేలకు అక్రమంగా సదరు నిందితులు అమ్ముతున్నారని సమాచారం.

Latest Updates