యాంటి బయాటిక్స్ పరిమితికి మించి వాడినట్లయితే..

ఏదైనా చిన్న వ్యాధికి గురైతే అందుకు తగ్గ యాంటీ బయాటిక్స్ వాడటం ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ యాంటిబయాటిక్స్ తీసుకోవడం వల్ల జరిగే ప్రయోజనం కంటే దుష్ఫలితాలే ఎక్కువని పలువురు వైద్యులు చెబుతున్నారు. యాంటీబయాటిక్స్ లేదా యాంటీ బాక్టీరియల్స్  అనేవి శరీరంలో బ్యాక్టీరియా పెరుగుదలను నెమ్మదిగా నాశనం చేసే మందులు. జలుబు, ఫ్లూ మరియు దగ్గు వంటి వైరల్ ఇన్ఫెక్షన్లకు ఈ యాంటీబయాటిక్స్ పని చేయవు.  బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల  ద్వారా వచ్చే జ్వరం, న్యుమోనియా వంటి జబ్బులకు ఇవి కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇస్తాయి. వీటిని పరిమితికి మించి వాడటం వల్ల మన శరీరం రోగ నిరోధక శక్తిని కోల్పోతుందని, దాని వల్ల మన శరీరం వాతావరణం మరియు వయస్సు రీత్యా ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను తట్టుకోలేదని  ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కూడా హెచ్చరించింది.

మితిమీరిన యాంటీ బయాటిక్స్ వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలు.. మరి వాటిని ఎలా ఎదుర్కొవాలనే విషయాలను ఇక్కడ చూద్దాం

డాక్టర్ సూచించకుండా పరిమితికి మించి  యాంటీబయాటిక్స్‌ను వాడినట్లయితేఈ క్రింది వాటికి గురయ్యే ప్రమాదం ఉంది.

  1. యాంటీబయాటిక్స్ అధికంగా వాడటం వ్యాధినిరోధకతకు దారితీస్తుంది. ఒకానొక సమయంలో శరీరంలో బాక్టీరియా ఎక్కువగా పెరిగినపుడు.. ఆ మందుల డోస్ బాక్టీరియా మీద పనిచేయదు. దీని వల్ల ఆ బ్యాక్టీరియా వృద్ధి చెంది మరింత బాధను కలుగజేస్తుంది.  ఈ యాంటీబయాటిక్స్ వల్ల కలిగే ఇన్ఫెక్షన్లతో రోగులు ఎక్కువ కాలం ఆసుపత్రికే పరిమితమవ్వాల్సి వస్తుంది.
  2. ఈ యాంటిబయాటిక్స్ వాడటం వల్ల జ్వరం, జలుబు వంటి సాధారణ అంటువ్యాధులపై ఎలాంటి చికిత్స చేయలేవని WHO తెలిపింది
  3. ఏ వయసులోనైనా, ఎవరిపై అయినా అంటు వ్యాధులు ప్రభావితం చేస్తాయి.
  4. యాంటీబయాటిక్స్‌.. బ్యాక్టీరియాని నిరోధిస్తాయి కానీ, రోగాన్ని కాదు.
  5. శరీరానికి అవసరం లేకపోయినా వీటిని తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధకత కు కారణమవుతుంది. WHO ప్రకారం ఇది ప్రపంచ ఆరోగ్యానికి అతిపెద్ద ముప్పు.
  6. మీరు యాంటీబయాటిక్స్‌కు నిరోధకత పొందిన తర్వాత, మీరు తీసుకుంటున్న చికిత్సలు ఏవీ పనిచేయవు.

మీరు అనారోగ్యానికి గురైన ప్రతిసారీ యాంటీబయాటిక్స్ వాడటం తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తుంది కానీ ముందు ముందు ఊహించని దానికంటే ఎక్కువ హాని కలుగజేస్తుంది.

యాంటి బయాటిక్స్ తో కాకుండా కొన్ని సహజమార్గాలతో, మన ఇంట్లో ఉండే ఆహార పదార్ధాలతో  మనకు కలిగే వ్యాధుల నుంచి త్వరగా ఉపశమనం పొందొచ్చు . అవి 1) తగినంత విశ్రాంతి తీసుకోవడం, 2) తగినంత నీరు త్రాగటం మరియు 3) పెరుగన్నం. ఈ మూడింటిని తీసుకోవడం వల్ల శరీరానికి ఎటువంటి హాని కలుగదు. ఎలాంటి దుష్ప్రభావాలు రావు. యాంటీబయాటిక్స్ ఒక రోజులో తక్షణ ఉపశమనం కలిగించవచ్చు, కానీ  వీటి ద్వారా యాంటీబయాటిక్ నిరోధకత లేకుండా ఉపశమనం ఇస్తాయి.

విశ్రాంతి: అనారోగ్యానికి గురైనప్పుడు తగినంత విశ్రాంతి తీసుకోవడం  వల్ల వ్యాధి నుంచి త్వరగా కోలుకునే ప్రక్రియను వేగవంతం అవుతుంది.  శరీరాన్ని రోగం నుంచి నయం చేసి, రోగనిరోధక శక్తిని పునరుద్ధరించడంలో కూడా సహాయపడుతుంది.

నీరు: అనారోగ్యంతో ఉన్నప్పుడు.. రోజంతా వేడి లేదా గోరువెచ్చని నీటిని తాగాలి. దగ్గు మరియు జలుబు విషయంలో, ఇది గొంతుకు ఉపశమనం ఇస్తుంది. దగ్గును అరికడుతుంది. శరీరాన్ని బాగా హైడ్రేట్ గా ఉంచడం వల్ల త్వరగా,సమర్ధవంతంగా కోలుకోవడానికి అవకాశముంది

పెరుగన్నం: ఇది ప్రోబయోటిక్ అధికంగా ఉండే ఈ ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణక్రియను మెరుగుపడుతుంది. దీంతో శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది.

డాక్టర్ యాంటీబయాటిక్స్ వాడకూడదని చెప్పినట్లయితే పై మూడు పద్ధతుల ద్వారా జబ్బును నయం చేసుకొనే వీలుంది.

                                                                                                    నవంబర్ (18-24) యాంటీబయాటిక్ అవేర్‌నెస్ వీక్ సందర్భంగా.. 

Latest Updates