బాలీవుడ్ న‌టుడు అనుప‌మ్ ఖేర్ కుటుంబంలో న‌లుగురికి క‌రోనా

బాలీవుడ్ న‌టుడు అమితాబ్ బ‌చ్చ‌న్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్‌లకు కరోనా సోకిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మ‌రో బాలీవుడ్ నటుడి కుటుంబంలోని నలుగురు వ్య‌క్తుల‌కు క‌రోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది. ప్ర‌ముఖ న‌టుడు ‌అనుపమ్ ఖేర్ కుటుంబసభ్యుల్లో నలుగురికి కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని స్వయంగా అనుపమ్ ఖేర్ ట్వీట్ ద్వారా వెల్లడించారు.

అనుపమ్ ఖేర్ తల్లి, తమ్ముడు, మరదలు, మేనకోడలికి కరోనా పాజిటివ్ గా తేలినట్టు..తనకు మాత్రం రిపోర్ట్ నెగెటివ్‌గా వచ్చిందని అనుపమ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం తామంతా హోమ్ క్వారెంటైన్‌లో ఉన్నామని, తమ్ముడి ఇంటిని శానిటైజ్ చేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. కరోనా వైరస్ బారిన పడిన తల్లి దులారిను ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చేర్చినట్టు అనుపమ్ వెల్లడించారు

Latest Updates