అలా అనేసరికి చాలా హర్టయ్యా..అందుకే దూరంగా ఉన్న

అచ్చతెలుగు అమ్మాయిలా కనిపించే అనుపమా పరమేశ్వరన్ బేసిగ్గా కేరళ కుట్టి. అయితే తెలుగులోనే ఎక్కువ ఫేమస్. సొంత భాషలో మూడు సినిమాలే చేసింది. ఇప్పుడు ఇంకొకటి చేస్తోంది. నిజానికి అనుకున్నంత వేగంగా లేదామె కెరీర్. మంచి నటిగా పేరున్నా అవకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. కనీసం మాతృభాషలో కూడా ఎందుకు ఎక్కువ అవకాశాలు రావట్లేదు? ఇదే ప్రశ్న రీసెంట్‌‌‌‌గా ఆమెని అడిగారొకరు. దానికి అనుపమ చెప్పిన విషయం విని అందరూ షాకయ్యారు. తన మనసు గాయపడటం వల్లే మాలీవుడ్‌‌‌‌కి అనుపమ దూరంగా ఉందట.

‘‘నేను ఫస్ట్టైమ్‘ప్రేమమ్’ లో చిన్న పాత్ర చేశాను. ఆ సినిమా రిలీజ్‌‌‌‌కి ముందు ప్రమోషన్‌‌‌‌కోసం చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాను. దాంతో అందరూ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నానని అన్నారు. లెక్క చేయకపోవడంతో నాకు అహంకారం అని ట్రోల్ చేశారు. అందరూ అలా అనేసరికి చాలా హర్టయ్యాను. అప్పటికి మరీ చిన్నదాన్ని కదా. అందుకే కొన్నాళ్లు మలయాళ సినిమాలకి దూరంగా ఉండాలనే ఉద్దేశంతో తమిళ,తెలుగు చిత్రాలపై దృష్టిపెట్టాను. అప్పుడే ‘అఆ’ సినిమాలో నెగెటివ్ రోల్ చేయమని ఆఫర్ వచ్చింది. భాష రాకపోయినా తెలుసుకుని మరీ ఆ క్యారెకర్ చేశాను. తెలియని దాంట్లోవేలు పెడుతున్నావని అప్పుడు కూడా అందరూ ట్రోల్ చేయడం స్టార్ట్చేశారు. అయినా చాలెంజింగ్‌‌‌‌గా తీసుకుని చేశాను. తర్వాత నా కెరీర్ మలుపు తిరిగింది’ అంటూ తనెంత పట్టుదలతో ఇండస్ట్రీలో నిలబడిందో చెప్పుకొచ్చింది అనుపమ.

Latest Updates