సింగర్ అనురాధ పౌడ్వాల్ తనయుడి మృతి

ప్రముఖ బాలీవుడ్ సింగర్ అనురాధ పౌడ్వాల్ తనయుడు ఆదిత్య పౌడ్వాల్ మృతి చెందారు. గత కొద్ది రోజులుగా ఆదిత్య కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కిడ్నీ ఫెయిల్‌ కావడం…పరిస్థితి విషమించడంతో 35 ఏళ్ల ఆదిత్య కన్నమూశారు. తల్లి అడుగుజాడల్లో నడుస్తూ ఆదిత్య కూడా మ్యూజిక్ రంగంలోకి అడుగుపెట్టారు. కొన్ని భక్తి ప్రధానమైన మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ చేసిన ఆదిత్య, బాల్‌ థాక్రే బయోపిక్‌ థాక్రే సినిమా సంగీత విభాగంతో అసోసియేట్‌ అయ్యి వర్క్‌ చేశారు. ఆదిత్య మ్యూజిక్‌ రంగంలో రాణిస్తోన్నసమయంలో అనారోగ్యానికి గురై చనిపోవడం బాధాకరమైన విషయమని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి.

Latest Updates