భర్త కోహ్లీ సాయంతో అనుష్క సాహసం… శీర్షాసనం వల్ల ఉపయోగాలు

చూడ ముచ్చటగా ఉండే అనుష్క‌‌– విరాట్ కోహ్లీ జంటను చూస్తే ఎవరైనా ఫిదా కావాల్సిందే. అందుకే వారికి సంబంధించిన ప్రతీ విషయాన్ని ఎప్పటికప్పుడు తమ ఫ్యాన్స్‌‌తో పంచుకుంటారు. తాజాగా ప్రెగ్నెంట్ తో ఉన్న అనుష్క శీర్షాసనం వేస్తుండగా..ఆమెకు కోహ్లీ సాయం చేశాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

“ యోగా నా జీవితంలో భాగమైంది. జనవరి నెలలో డెలివరీ కానున్న నేపథ్యంలో యోగాసనాలను వేయాలని డాక్టర్లు సజెస్ట్ చేశారు. అందుకే ఆసనం వేశాను. ఆ ఆసనానికి గోడ సపోర్ట్ ఉంది. నా భర్త కోహ్లీ సపోర్ట్ తో శీర్షాసనం” వేశానంటూ ఫోటోల్ని నెటిజన్లతో పంచుకున్నారు.

 శీర్షాసనం వల్ల ఉపయోగాలు

ఆసనాల్లో రారాజు శీర్షాసనం అంటారు యోగానిపుణులు. డాక్టర్లు, యోగా నిపుణల సారధ్యంలో శీర్షాసనం వేయాలి. ఈ ఆసనం వల్ల తల, మెదడు, కార్నివాల్ నెర్వస్ సిస్టమ్‌కి రక్తప్రసరణ చాలా బాగా జరుగుతుంది.  కోర్ మజిల్స్, భుజాలు, చేతులు బలంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. లింఫటిక్ సిస్టమ్‌ని ఉత్తేజపరచడం వల్ల టాక్సిన్స్ ఎక్కువగా శరీరంలో నుంచి బయటకు పోతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా మనసుకి మంచి ఏకాగ్రతను అలవాటు చేయడానికి, జ్ఞాపకశక్తి పెరగడానికి ఒత్తిడి నుంచి దూరంగా ఉండటానికి లేదా ఉపశమించడానికి చాలా ఉపయోగకరమైనది ఈ ఆసనం. శీర్షాసనం పూర్తి అయిన తరువాత శవాసనంలో విశ్రాంతి పొందాలి. లేదా ధ్యానంలో కూర్చొని వచ్చే మార్పులు గమనించాలి.

ముఖ్య గమనిక : ఇది కష్టమైన ఆసనం కనుక యోగనిపుణుల పర్యవేక్షణలో చేయాలి. మొదటిసారిగా సాధన చేసేవారు తోటి సాధకుల సపోర్ట్ తీసుకుని చేయడం మంచిది.

Latest Updates