గవాస్కర్ మీ వ్యాఖ్యలు అసహ్యంగా ఉన్నాయ్..2020 వచ్చినా మీరు మారలేదు : అనుష్క

తనపై, తన భర్త విరాట్ కోహ్లీపై..సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలపై అనుష్క శర్మ స్పందించింది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ ఓడిపోవడం, ఫీల్డింగ్ లో, బ్యాటింగ్ లో కోహ్లీ రాణించకపోవడంతో సునీల్ గవాస్కర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఆ వ్యాఖ్యలపై అనుష్క స్పందించారు.గవాస్కర్ మీరంటే మాకు గౌరవం. కానీ మీరు చేస్తున్న వ్యాఖ్యలు అసహ్యంగా ఉన్నాయి. తన భర్త గేమ్ లో తనని ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించింది అనుష్క.

కామెంటీటర్ గా ప్రతీ ఒక్క క్రికెటర్ వ్యక్తిగత జీవితాల్ని గౌరవించాలి. అలాగే మా జీవితాల్ని గౌరవించాలి.

రాత్రి నా భర్త ఆటతీరుపై మీరు చేసిన వ్యాఖ్యలే కాకుండా..మనసులో ఇంకా చాలా పదాలు ఉండే ఉంటాయని నేను అనుకుంటున్నాను. కానీ వాటికి నాపేరును ఉపయోగిస్తేనే మీ విమర్శలు పవర్ ఫుల్‌గా ఉంటాయనుకున్నారా? అని ప్రశ్నించింది

గవాస్కర్ జంటిల్ మెన్ గేమ్ లో మీరో దిగ్గజం. 2020వచ్చినా పరిస్థితులు మారలేదు. ఎప్పుడూ మమ్మల్ని గేమ్ లోకి లాగేందుకు ప్రయత్నిస్తుంటారు. మీరు నా పట్ల చేసిన వ్యాఖ్యలు విన్న తర్వాత నాకు ఏం అనిపించిందో అది చెప్పాలనుకున్నా అని అనుష్క ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.

Latest Updates