డైనోసార్ ను ఇమిటేట్ చేసిన విరాట్ కోహ్లీ

న్యూఢిల్లీ: స్వదేశీ, విదేశీ టూర్స్ తో ఎప్పుడూ బిజీగా ఉండే క్రికెటర్స్ లాక్ డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమయ్యారు. అనుకోకుండా ఖాళీ టైమ్ దొరకడంతో ఫ్యామిలీస్ తో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా భార్య అనుష్క శర్మతో కలసి సరదాగా గడుపుతున్నాడు. పేరెంట్స్ తో బోర్డు గేమ్స్ ఆడుతూ, సరదా వీడియోలు షేర్ చేస్తూ విరుష్క జోడీ వార్తల హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. బుధవారం కోహ్లీ చేసిన ఓ కామెడీ వీడియోను అనుష్క ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ వీడియోలో భీకర జంతువైన డైనోసార్ ను కోహ్లీ ఇమిటేట్ చేస్తూ కనిపించాడు. ఈ వీడియోకు తానో డైనోసార్ ను కనుగొన్నట్లు అనుష్క క్యాప్షన్ జత చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై చాలా మంది సెలెబ్రిటీలు కామెంట్స్‌ చేస్తున్నారు.

Latest Updates