స్వయంగా వండి పెట్టిందట : కోహ్లీసేనకు అనుష్క డిన్నర్

టీమిండియా, RCB, కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంట్లో సందడి చేశారు బెంగళూరు టీమ్ ప్లేయర్లు. 15న ముంబైలోని వాంఖెడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌ వర్సెస్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మ్యాచ్‌ జరిగింది. ప్లేయర్లంతా అక్కడే ఉండడంతో విరాట్, అనుష్క వారిని తమ ఇంటికి ఆహ్వానించారు. అందరు కలిసి డిన్నర్ చేశారు. ఓ కర్రీ మాత్రం తన ముద్దుల భార్య అనుష్కనే చేసిందని విరాట్ చెప్పాడంతో అందరు ఎగబడి తినేశారట. డిన్నర్ తర్వాత విరాట్‌, అనుష్కతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

యుజ్వేంద్ర చాహల్‌, హిమ్మత్‌ సింగ్‌, దేవ్‌ పడిక్కల్‌, కుల్వంత్‌ కేజ్రోలియా, బర్మన్‌ ఇన్‌ స్టాగ్రామ్‌ లో షేర్‌ చేశారు. అయితే ఆ రోజు జరిగిన మ్యాచ్‌ లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు టీమ్ ఓడిపోయింది. ఐదు వికెట్ల తేడాతో ముంబయి విజయం సాధించింది. ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లలో బెంగళూరు జట్టును ఒక విజయమే వరించింది. ఏడు మ్యాచ్‌ లు ఓడిపోయింది.

Latest Updates