ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్ఎస్ పార్టీదే

చేగుంటలో మంత్రి హరీష్ రావు కామెంట్

మెదక్: తెలంగాణ రాష్ర్టంలో టీఆర్ఎస్ పార్టీకి ఎదురు లేదని… ఎలాంటి ఎన్నికలొచ్చినా గెలుపు టీఆర్ఎస్ దే ఉంటుందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. చేగుంట మండలం బాలాజీ గార్డెన్ లో మంత్రి హరీష్ రావు సమక్షంలో బీజేపీ వైస్ ఎంపీపీ  మున్నూరూ రాంచంద్రం టిఆర్ఎస్ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. నిజామాబాద్  ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అద్భుతమైన విజయం సాధించిందన్నారు. కాంగ్రెస్,బిజెపి లకు డిపాజిట్లు గల్లంతు అయ్యాయి.. రెండు పార్టీల ఓట్లు కలిపినా డిపాజిట్లు కూడా రాలేదన్నారు. రేపు జరిగే దుబ్బాక ఉప ఎన్నికల్లో ఇదే తరహా ఫలితాలు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బిజెపిల గోబెల్స్ ప్రచారాలు, సోషల్ మీడియా లో ప్రభుత్వం పై చేస్తున్న ఆరోపణలు పచ్చి అబద్దాలని నిజామాబాద్ ఎన్నికల్లో తేలిపోయిందన్నారు. మొన్న హుజూర్ నగర్, నేడు నిజామాబాద్, రేపు దుబ్బాక, ఎల్లుండి గ్రేటర్ హైదరాబాద్.. ఎన్నిక ఏదైనా గెలుపు  టి ఆర్ ఎస్ పార్టీ దే ఉంటుందన్నారు. టిఆర్ఎస్ పార్టీ పై ప్రజలకు ఉన్న విశ్వసానికి… నమ్మకానికి నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక నే తాజా నిదర్శనమని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.

Latest Updates