జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌లో ఎవరైనా భూములు కొనొచ్చు

గెజిట్‌‌‌‌ రిలీజ్‌‌‌‌ చేసిన కేంద్రం

శ్రీనగర్‌‌‌‌‌‌‌‌: జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌లో ఇకపై ఎవరైనా భూములు కొనుగోలు చేయచ్చు. ఈ మేరకు నిర్ణయం తీసుకుంటూ కేంద్రం గెజిట్‌‌‌‌ రిలీజ్‌‌‌‌ చేసింది. అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ ల్యాండ్స్‌‌‌‌ను దీని నుంచి మినహాయిస్తున్నట్టు ప్రకటించింది. రెసిడెన్షియల్‌‌‌‌ ప్రూఫ్స్‌‌‌‌ లేకుండానే జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌లో ల్యాండ్స్‌‌‌‌ కొని, అక్కడ ఉండచ్చు అని కేంద్ర హోంశాఖ స్పష్టంచేసింది. రీ ఆర్గనైజేషన్‌‌‌‌ యాక్ట్‌‌‌‌  ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పింది. పోయిన ఏడాది ఆగస్టులో ఆర్టికల్‌‌‌‌ 370, 35–ఎ ను రద్దుచేస్తూ బిల్లు పాస్‌‌‌‌ చేసింది. అంతకుముందు ఇక్కడ భూములు కొనే అధికారం నాన్‌‌‌‌–రెసిడెంట్స్‌‌‌‌కు లేదు. వేరే ప్రాంతాల నుంచి వచ్చేవారు కూడా ఇక్కడ ఇండస్ట్రీస్‌‌‌‌ పెట్టాలినే ఉద్దేశంతోనే ఈ అమెండ్‌‌‌‌మెంట్స్‌‌‌‌ చేస్తున్నట్టు ఎల్జీ మనోజ్ ​సిన్హా వెల్లడించారు. అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ ల్యాండ్స్‌‌‌‌ను నాన్‌‌‌‌–అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ ల్యాండ్స్‌‌‌‌గా కన్వర్ట్‌‌‌‌ చేయడానికి ఈ అమెండ్‌‌‌‌మెంట్‌‌‌‌ ప్రకారం కుదరదని చెప్పారు. ఈ అమెండ్‌‌‌‌మెంట్స్‌‌‌‌ ఆమోదయోగ్యంకాదని, దీనివల్ల తక్కువ భూమి ఉన్న యజమానులు ఇబ్బందులు పడతారని ఎన్సీ లీడర్‌‌‌‌‌‌‌‌ ఒమర్‌‌‌‌‌‌‌‌ అబ్దుల్లా ట్వీట్‌‌‌‌ చేశారు.

For More News..

చైనా కట్టడికి ఇండియాకు అండగా ఉంటామన్న అమెరికా

మావోయిస్ట్‌ల కోసం హెలికాప్టర్​తో కూంబింగ్​

స్మార్ట్ ఫోన్ వాడకంతో నష్టాలెంటో తెలిస్తే.. మళ్లీ ఫోన్ ముట్టరు

Latest Updates