‘ఈ పుస్తకం ఎవరి చేతిలోనైనా కన్పించిందా.. ఇక అంతే’

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీతో పోల్చిన ఓ పుస్తకంపై శివసేన పార్టీ తీవ్రంగా మండిపడుతోంది. ‘నేటి శివాజీ నరేంద్ర మోదీ’ (టుడేస్ శివాజీ నరేంద్ర మోదీ) అనే పేరుతో జై భగవాన్ గోయల్ అనే బీజేపీ లీడర్ రాసిన ఈ పుస్తకం ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం విడుదల చేశారు. శివాజీని మోదీతో పోల్చడం ఏంటని మహారాష్ట్రలోని అధికార కాంగ్రెస్-శివసేన-ఎన్‌సీపీలు బీజేపీపై నిప్పులు చెరిగాయి.

శివసేన ఎంపి సంజయ్ రౌత్ మాట్లాడుతూ, “ఈ పుస్తకం ఎవరి చేతిలోనైనా కనిపిస్తే, వారు భయంకరమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది” అని హెచ్చరించారు.

శివాజీ వంశస్థుడైన శంభాజీ రాజే సైతం… శివాజీతో నరేంద్ర మోదీనే కాదు, ప్రపంచంలో మరెవ్వరినీ పోల్చలేమంటూ అన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈనెల 14న మహారాష్ట్ర వ్యాప్తంగా ఈ పుస్తకానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టనుంది.

Latest Updates