ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా

ap-assembly-postponed-tomorrow

అధికార, ప్రతిపక్షాల మాటల యుద్ధం మధ్య ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. స్పీకర్ తమ్మినేని సీతారాం ను చైర్ లో కూర్చోబెట్టే క్రమంలో సంప్రదాయం ప్రకారం ప్రతిపక్ష నేతను పిలవలేదని చంద్రబాబు ఆరోపించారు. దీంతో.. వైసీపీ సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రబాబు తన బంట్రోతు అచ్చెన్నాయుడుని పంపించారని అనడంతో సభలో దుమారం రేగింది. ఒక ఎమ్మెల్యేను పట్టుకొని బంట్రోతు అనడం ఎంతవరకు సమంజసం అంటూ అచ్చెన్నాయుడు, ప్రతిపక్ష సభ్యులు చెవిరెడ్డిని క్షమాపణలు చెప్పాలని పట్టుబట్టారు. చెవిరెడ్డి వ్యాఖ్యలను పరిశీలిస్తామని స్పీకర్ హామీ ఇవ్వడంతో పాటు.. సభ రేపు ఉదయం 9 గంటలకు వాయిదా వేశారు.

 

Latest Updates