40 ఏళ్ల రాజకీయ అనుభవం ఇదేనా?

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టడంపై మాట్లాడుతుండగా.. సీఎం జగన్ కల్పించుకొని రేపు ఆ విషయం మీదే చర్చ ఉందని, సభా సమయాన్ని వృథా చేయోద్దని కోరారు. అయినా కూడా చంద్రబాబునాయుడు అదే విషయం మీద మాట్లాడుతుండటంతో.. స్పీకర్ దయచేసి సభా సమయాన్ని వృథా చేయోద్దని కోరారు. దాంతో నిగ్రహం కోల్పోయిన చంద్రబాబు.. స్పీకర్‌ను ఉద్దేశించి మర్యాదగా ఉండదని హెచ్చరించారు. దాంతో స్పీకర్ తీవ్ర కోపోద్రిక్తులయ్యారు. చంద్రబాబు తన వ్యాఖ్యలను వెనుకకు తీసుకోవాలని హెచ్చరించారు. స్పీకర్ పదవిలో ఉన్న తన గురించి ఇలా మాట్లాడటం మర్యాద కాదని ఆయన అన్నారు. మీ 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఇదేనా అని చంద్రబాబును స్పీకర్ ప్రశ్నించారు.

Latest Updates