క‌రోనా టెస్టుల్లో దేశంలోనే ఏపీ టాప్

ఆంధ్ర‌ప్ర‌దేశ్: క‌రోనా టెస్టుల్లో దేశంలోనే ఏపీ ఫ‌స్ట్ ప్లేస్ లో నిలిచింది. ఈ విష‌యాన్ని బుధ‌వారం రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ తెలిపింది. పది లక్షల మందికి సగటున ఏపీలో 830 మందికి పరీక్షలు నిర్వహించి దేశంలోనే తొలిస్థానంలో నిలిచిన‌ట్లు చెప్పింది. ఇప్పటి వరకు 41,512 మందికి టెస్టులు చేశామని.. మంగ‌ళ‌వారం ఒక్క రోజే 5,757 మందికి టెస్టులు నిర్వహించామని ప్రకటించింది.

ఇందులో ట్రూనాట్ ద్వారా 3082 శాంపిళ్లను టెస్ట్‌ చేశామని.. ట్రూనాల్ టెస్టుల స‌మాచారాన్ని ఐసీఎమ్ఆర్ కు ఎప్ప‌టిక‌ప్పుడు పంపుతున్నామ‌ని తెలిపింది ఏపీ వైద్య ఆరోగ్య‌శాఖ‌. అటు 809 మందికి పరీక్షలు చేసి తర్వాతి స్థానంలో రాజస్థాన్‌ నిలిచింది.

Latest Updates