ఏపీ బడ్జెట్ కేటాయింపులివే..

ఏపీ  అసెంబ్లీలో ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2019-20 సంవత్సర బడ్జెట్ ను  ప్రవేశపెట్టారు. రాష్ట్రంలోని ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, బడుగు, బలహీన వర్గాలకు అభివృద్ధి పథకాలు అందేలా రూ.2,27,974 కోట్లతో ఏపీ బడ్జెట్ ను  ప్రవేశ పెట్టారు. అందులోని ముఖ్యమైన పథకాలు.. కేటాయింపులు….

1) వైయస్ఆర్ రైతు భరోసాః రూ.8,750 కోట్లు

2) వైయస్ఆర్ 9 గంటల ఉచిత విద్యుత్ః రూ.4,560 కోట్లు

3) ధరల స్థిరీకరణ నిధిః రూ.3,000 కోట్లు

4) ప్రకృతి వైపరీత్యాల నిధిః రూ.2,002.08 కోట్లు

5) వైయస్ఆర్ – పీఎం ఫసల్ బీమా యోజనః రూ.1163 కోట్లు

6) ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ కోసం: రూ.475 కోట్లు

7) రైతులకు ఉచిత బోర్లు ( వైయస్ఆర్ రైతు భరోసా): రూ.200 కోట్లు

8) రైతు విత్తనాల కోసం: రూ.200 కోట్లు

9) వేర్ హోసింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ః రూ.200 కోట్లు

10) వైయస్ఆర్- అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ః రూ.109. 28 కోట్లు

11) ఫామ్ మెకనైజేషన్ః రూ.100. 05 కోట్లు

12) రైతులకు వైయస్ఆర్ సున్నావడ్డీ రుణాలుః రూ.100 కోట్లు

13) రైతులు మరణిస్తే.. నష్ట పరిహారం: రూ.100 కోట్లు

14) సహకార డైరీల బలోపేతం కోసం: రూ.100 కోట్లు

15) పశు గ్రాసం, దాణా కోసం: రూ.100 కోట్లు

16) గోదాముల నిర్మాణం కోసం: రూ.37. 54 కోట్లు

17) మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఆర్థిక సాయం కోసం: రూ.100 కోట్లు

18) జెట్టీలు, హార్బర్ల నిర్మాణాల కోసం: రూ.100 కోట్లు

19) మత్స్యకారుల బోట్లకు డీజిల్ సబ్సిడీ కోసం: రూ.100 కోట్లు

20) మత్స్యకారుల |అభివృద్ధికిః రూ.100 కోట్లు

21) షెడ్యూలు కులాల మత్స్యకారుల సంక్షేమం కోసం: రూ.50 కోట్లు

22) జగనన్న అమ్మఒడిః రూ.6,455.80 కోట్లు

23) పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం: రూ.1500 కోట్లు

24) మధ్యాహ్న భోజన పథకం కోసం: రూ.1077 కోట్లు

25) వైయస్ఆర్ – స్కూళ్ళ నిర్వహణ నిధిః రూ.160 కోట్లు

26) వంటశాలల నిర్మాణం కోసం(అక్షయపాత్ర): రూ.100 కోట్లు

27) డా. వైయస్ఆర్ ఆరోగ్యశ్రీః రూ.1740 కోట్లు

28) ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కోసం: రూ.1500 కోట్లు

29) ఆశా వర్కర్ల గౌరవ వేతనం కోసం: రూ.455.85 కోట్లు

30) వైద్య భవనాల కోసం: రూ.68 కోట్లు

31) డా. వైయస్ఆర్ ట్రైబల్ మెడికల్ కాలేజీః రూ.66 కోట్లు

32) గురజాలలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ కోసం: రూ.66 కోట్లు

33) విజయనగరంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ కోసం: రూ.66 కోట్లు

34) పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, ఆసుపత్రి కోసం: రూ.50 కోట్లు

35) రాష్ట్ర క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ కోసం: రూ.43.60 కోట్లు

36) గృహ నిర్మాణం కోసం మొత్తం: రూ.9,785.75 కోట్లు,

వైయస్ఆర్ గృహ వసతిః రూ.5000 కోట్లు

  1. ప్రధానమంత్రి ఆవాస్ యోజన(అర్బన్): రూ.1370 కోట్లు
  2. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్):

వైయస్ఆర్ బలహీనవర్గాల గృహ నిర్మాణం కోసం: రూ.1280.29 కోట్లు

వైయస్ఆర్ అర్బన్ హౌసింగ్ : రూ.1000 కోట్లు

ప్రధాన మంత్రి ఆవాస యోజన(గ్రామీణ): రూ.565.25 కోట్లు

బలహీన వర్గాల ఇళ్ళ నిర్మాణం కోసం: రూ.150.21

37) వైయస్ఆర్ పెన్షన్స్..

వైయస్ఆర్ పెన్షన్స్ కోసం:  రూ.15,813.51 కోట్లు

వైయస్ఆర్ పెన్షన్ కానుక వృద్ధులు, వితంతువులు కోసం: రూ.12801.04 కోట్లు

దివ్యాంగుల పెన్షన్ కానుక కోసం: రూ.2133.62 కోట్లు

ఒంటరి మహిళల పెన్షన్ కానుక కోసం: రూ.300 కోట్లు

మత్స్యకారుల పెన్షన్ కానుక కోసం: రూ.130 కోట్లు

ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పెన్షన్ల కోసం: రూ.100.20 కోట్లు

కిడ్నీ డయాలసిస్ రోగుల పెన్షన్ల కోసం: రూ.85 కోట్లు

కల్లు గీత కార్మికుల పెన్షన్ల కోసం: రూ.78.85 కోట్లు

వైయస్ఆర్ అభయ హస్తం పెన్షన్ల కోసం: రూ.90.88 కోట్లు

ట్రాన్స్ జెండర్ల పెన్షన్ల కోసం రూ.7 కోట్లు

38) వైయస్ఆర్ కళ్యాణ కానుక..

బీసీల కోసం వైయస్ఆర్ కళ్యాణ కానుకః రూ.300 కోట్లు

ఎస్సీల కోసం  వైయస్ఆర్ కళ్యాణ కానుకః రూ.200 కోట్లు

వైయస్ఆర్ గిరి పుత్రిక కళ్యాణ పథకం(ఎస్టీ): రూ.40 కోట్లు

వైయస్ఆర్ షాదీ క తోఫా(మైనార్టీ): రూ.100 కోట్లు

వైయస్ఆర్ కళ్యాణ కానుకః రూ.30.26 కోట్లు

1.వైయస్ఆర్ కళ్యాణ కానుక(ఇంటర్ క్యాస్ట్): రూ.36 కోట్లు

2.వైయస్ఆర్ కళ్యాణ కానుక(ఇంటర్ క్యాస్ట్): రూ.5 కోట్లు

39) కాపు సంక్షేమం కోసం: రూ.2000 కోట్లు

40) అగ్రిగోల్డ్ బాధితుల కోసం: రూ.1150 కోట్లు

41) వైయస్ఆర్ బీమాః రూ.404.02 కోట్లు

42) ఆటో డ్రైవర్ల కు ఆర్థిక సాయం: రూ.400 కోట్లు

43)నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్స్ కు వైయస్ఆర్ ఆర్థిక సాయం: రూ.300 కోట్లు

44)చేనేతలకు వైయస్ఆర్ ఆర్థిక సాయం: రూ.200 కోట్లు

45)ధార్మిక సంస్థలకు వైయస్ఆర్ గ్రాంట్స్ః రూ.234 కోట్లు

46)బ్రాహ్మణ సంక్షేమ కార్పోరేషన్ః రూ.100 కోట్లు

47) లాయర్ల సంక్షేమం కోసం, ట్రస్టు ఏర్పాటుః రూ.100 కోట్లు

48) లాయర్లకు సాయం: రూ.10 కోట్లు

49) సబ్సిడీ బియ్యం కోసం: రూ.3000 కోట్లు

50) రైస్ ప్యాకెట్ల  తయారీ కోసం: రూ.750 కోట్లు

51) సివిల్ సప్లయిస్ కార్పోరేషన్ కోసం: రూ.384 కోట్లు

52) గ్రామ వాలంటీర్ల కోసం: రూ.720 కోట్లు

53) గ్రామ సచివాలయాలకుః రూ.700 కోట్లు

54) మున్సిపల్ వార్డు వాలంటీర్లకుః రూ.280 కోట్లు

55) మున్సిపల్ వార్డు సెక్రటేరియేట్ లకు రూ.180 కోట్లు

56) ఏపీఐఐసీ కోసం: రూ.360 కోట్లు

57) కడప స్టీల్ ప్లాంట్ కోసం: రూ.250 కోట్లు

58) పరిశ్రమల ప్రోత్సాహకాల కోసం: రూ. 573.60 కోట్లు

59) పరిశ్రమల మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం: రూ. 250 కోట్లు

60) ఎంఎస్ఎంఈస్ కోసం: రూ. 200 కోట్లు

61) ఎంఎస్ఎంఈస్ ఇన్సెంటీవ్స్  కోసం: రూ. 200 కోట్లు

62) స్పెషల్ డెవలప్ మెంట్ ప్యాకేజీః రూ. 700 కోట్లు

63) రాజధానిలో మౌలిక సదుపాయాల కోసం: రూ. 500 కోట్లు

64) సీఎం అభివృద్ధి నిధిః రూ. 500 కోట్లు

65) ఎన్ జీ ఆర్ఈ కోసం: రూ. 500 కోట్లు

66) పీఎంజీఎస్ వై కింద  పంచాయితీరాజ్ రోడ్ల నిర్మాణం కోసం: రూ. 376.35 కోట్లు

పంచాయితీరాజ్ రోడ్ల కోసం: రూ. 350 కోట్లు

67) విశాఖపట్నం- చెన్నై ఇండస్ట్రీయల్ కారిడార్ నిర్మాణం కోసం: రూ. 200 కోట్లు

68) నూతన రైల్వే నిర్మాణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం వాటా (50 శాతం): రూ. 185 కోట్లు

69) పంచాయితీరాజ్ రోడ్లు(ఆర్ ఐ డీఎఫ్): రూ. 150 కోట్లు

70) స్మార్ట్ సిటీస్ నిర్మాణం కోసం: రూ. 150 కోట్లు

71) కడప యాన్యుటీ ప్రాజెక్టుల కోసం: రూ. 120 కోట్లు

72) సీఐఐపీ కింద మౌలిక సదుపాయాల ఏర్పాట్లుః రూ 100 కోట్లు

73) పులివెందుల ప్రాంత డెవలప్ మెంట్ ఏజెన్సీః రూ100 కోట్లు

74) అమరావతి- అనంతపురం నేషనల్ హైవేః రూ. 100 కోట్లు

75) సీఎం కాల్ సెంటర్ : రూ. 73.33 కోట్లు

76) రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీః రూ. 71.90 కోట్లు

77) క్యాపిటల్ రీజియన్ సోషల్ సెక్యూరిటీ ఫండ్ః రూ. 65 కోట్లు

78) మున్సిపల్ ఎన్నికల కోసం: రూ. 60 కోట్లు

79) మంగళగిరిని మోడల్ పట్టణంగా అభివృద్ధి చేయటం కోసం: రూ. 50 కోట్లు

80) మున్సిపాల్టీలు, నగర పంచాయితీలు, కార్పోరేషన్లలో వ్యర్థాల నిర్వహణ కోసం: రూ. 50 కోట్లు

81) అమరావతి క్యాపిటల్ సిటీ డెవలప్ మెంట్ ప్రాజెక్టు కోసం: రూ. 50 కోట్లు

82) డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాల కోసం: రూ. 1140 కోట్లు

83) పట్టణాల్లోని స్వయం ఉపాధి సంఘాలకు వైయస్ఆర్ ఉచిత రుణాలు:  రూ. 648 కోట్లు

84) ఆర్టీసీకి మొత్తంగా ఆర్థిక సాయం: రూ. 1832 కోట్లు

Latest Updates