ఈనెల 19న ఏపీ కేబినెట్ భేటీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ఈనెల 19న నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. సచివాలయంలోని 1వ బ్లాక్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షత వహిస్తారు. పలు కీలకమైన బిల్లుల ఆమోదానికి ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా  రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పారిశ్రామిక విధానానికి ఆమోద ముద్ర వేసేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు భోగట్టా. అయితే తెలంగాణతో కృష్ణ.. గోదావరి నది జలాల సమస్యలపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది. అపెక్స్ కౌన్సిల్ సమావేశం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై కూడా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Latest Updates