తూళ్లురుకు వరద ముప్పు..విశాఖలో సెక్రటరియేట్.. 4 రీజియన్లుగా ఏపీ అభివృద్ధి: జీఎన్ రావు కమిటీ

ఏపీని నాలుగు రీజియన్లుగా విభజించి అభివృద్ధి చేయాలని సీఎం జగన్ కు రిపోర్ట్ అందించినట్లు  ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిటైర్డ్ ఐఏఎస్ జీఎన్ రావు కమిటీ బృందం తేల్చిచెప్పింది. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే అంశంపై జీఎన్ రావు కమిటీ బృందం 13జిల్లాల్లో పర్యటించింది.

రాష్ట్రవ్యాప్తంగా పర్యటించిన జీఎన్ రావు కమిటీ మాట్లాడుతూ  రాష్ట్రాన్ని నాలుగురీజియన్లుగా విడదీస్తూ అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి సూచించినట్లు తెలిపింది.

అందులో ఒకరీజియన్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మరో రీజియన్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లా, మరో రీజయన్ లో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, నాలుగో రీజియన్ లో కడప, కర్నూల్, చిత్తూర్, రాయలసీమలను విభజిస్తూ అభివృద్ధి చేయాలని చెప్పింది.

శ్రీబాగ్ ఒప్పందాన్ని దృష్టిలో ఉంచుకొని  విశాఖలో బెంచ్ , అమరావతిలో బెంచ్, కర్నూల్ లో హైకోర్ట్  ఏర్పాటు చేయాలని  ప్రభుత్వానికి నివేదిక అందించినట్లు వెల్లడించింది.

ప్రస్తుతం రాజధాని ప్రాంతమైన తూళ్లురుకు వరదముప్పు ఉందన్న కమిటీ సభ్యులు.. అసెంబ్లీ తూళ్లురులో, సమ్మర్ సీజన్ లో విశాఖలో నిర్వహించాలన్నారు. అమరావతిలో గవర్నర్  కార్యాలయం , విశాఖలో సచివాలయం, సీఎం క్యాంప్ ఆఫీస్ ఉండాలని  జీఎన్ రావు కమిటీ సీఎం జగన్ కు సలహా ఇచ్చినట్లు వెల్లడించింది.

Latest Updates