సీఎస్ ఎల్వీ తో భేటీ అయిన ద్వివేది

AP Chief election officer dwivedi meets CS LV subramanyam

ఏపీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేది ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంతో భేటీ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిర్వహించాల్సిన క్యాబినెట్ విషయంపై వీరిద్దరూ చర్చించారు. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి మేరకే రాష్ట్రంలో క్యాబినెట్ నిర్వహిస్తామని ద్వివేది ఈ సందర్భంగా తెలిపారు.  దీంతో ఈ నెల 10 న  జరగాల్సిన క్యాబినెట్ నిర్వహణ వాయిదా పడొచ్చనే అనుమానం వ్యక్తమవుతోంది.

అజెండాలోని అంశాలపై ఈసీఐ అనుమతి ఉంటేనే క్యాబినెట్ నిర్వహిస్తామని ద్వివేది ఈ సందర్బంగా అన్నారు. తప్పనిసరిగా చర్చించాల్సిన అంశాలనే క్యాబినెట్ లో పెడతామని ఆయన అన్నారు.

అయితే క్యాబినెట్ లో ఏయే అంశాలు అజెండాలో పెట్టాలనేది సీఎం కార్యాలయం ముందుగా సమాచారం ఇవ్వాలని ఆయన అన్నారు. సీఎంవో ఇచ్చే అజెండాపైనే ఆయా శాఖల నుంచి వివరాలు  తీసుకుంటామని,  ఆ వివరాలను సీఎస్ ఆధ్వర్యంలో కమిటీ పరిశీలిస్తోందని ద్వివేది తెలిపారు.

Latest Updates