గోద్రాలో నరమేధం మరువలేం: మోడీపై చంద్రబాబు ఫైర్

  • బీజేపీ రాజకీయాల వల్లే జమ్ము కశ్మీర్ లో సంక్షోభం
  • పుల్వామా దాడిని మోడీ ఎన్నికల లబ్ధికి వాడుకుంటున్నారు
  • మమత కామెంట్స్ కు ఏపీ సీఎం చంద్రబాబు సమర్థన

విజయవాడ, వెలుగు: ప్రధాని నరేంద్ర మోడీ ఏమైనా చేయగల సమర్థుడని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. గోద్రాలో నరమేధాన్ని మర్చిపోయే ప్రసక్తే లేదన్నారు. మంగళవారం ఆయన పార్టీ  ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. పుల్వామా ఘటనను ఎన్నికల్లో లబ్ధి
కోసం వాడుకుంటున్నారన్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలను సమర్థిం చారు. “రాజకీయ లబ్ధి కోసం దేశాన్ని తాకట్టు పెడితే ఉపేక్షించేది లేదు. దేశ భద్రత విషయంలో రాజీ లేదు. బోర్డర్ స్టేట్స్ లో ప్రభుత్వాల అస్థిరత ప్రమాదకరం. బీజేపీ రాజకీయాల వల్లే జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌లో
సంక్షోభం ఏర్పడింది. జవాన్లకు మా మద్దతు ఉంటుంది” అని అన్నారు . వైఎస్సార్ సీపీలో చేరాలని హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఆస్తులు ఉన్న నేతలను బెదిరిస్తున్నా రని చంద్రబాబు ఆరోపిం చారు. పార్టీ నుం చి వెళ్లిపోయేవారి గురిం చి పట్టిం చుకోవాల్సిన అవసరం లేదన్నారు . వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
చంద్రబాబుతో మర్రి భేటీ
చంద్రబాబుతో తెలంగాణ కాం గ్రెస్‌‌‌‌‌‌‌‌ సీనియర్ నేత మర్రి శశిధర్‌‌‌‌‌‌‌‌రెడ్డి మంగళవారం అమరావతిలో భేటీ అయ్యారు . తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు ఆయన చెప్పారు . తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ పొత్తును ప్రజలకు సరిగ్గా వివరిం చలేకపోయామన్నారు. ప్రధాని నరేం ద్ర మోడీకి
వ్యతిరేకంగా పార్టీ లన్నీ ఏకమవుతున్నాయని ఆయన చెప్పారు.

Latest Updates