APలో మళ్లీ టీడీపీ గెలవాల్సిన అవసరం ఉంది : చంద్రబాబు

APలో మళ్లీ టీడీపీ గెలవాల్సిన అవసరం ఉందన్నారు… సీఎం చంద్రబాబునాయుడు. రాష్ట్రాన్ని లూటీ చేయడానికి బందిపోట్లు వస్తున్నారని వైసీపీ పై విరుచుకుపడ్డారు. తన దగ్గర పనిచేసిన కేసీఆర్… ఇప్పుడు తనపైనే దౌర్జన్యం చేస్తున్నాడని విమర్శించారు చంద్రబాబు. కేసీఆర్ టీడీపీ డేటా దొంగలించి వైసీపీకి ఇచ్చారని ఆరోపించారు చంద్రబాబు. వివేకానందరెడ్డి హత్య ఇంటి దొంగల పనేనని చెప్పారు. తాను ఉన్నంతవరకు ఎవరి ఆటలు సాగవని హెచ్చరించారు. విజయనగరం జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బాబు…. కేంద్ర ప్రభుత్వం ఏపీని మోసం చేసిందని విమర్శించారు.

Latest Updates