మరికాసేపట్లో మమతా బెనర్జీతో భేటీ కానున్న చంద్రబాబు

AP CM chandrababu reached kolkata to meet Mamata

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు సాయంత్రం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీని కలవనున్నారు. ఇప్పటికే కలకత్తా చేరుకున్న ఆయన మరికాసేపట్లో మమత తో భేటీ కానున్నారు. ఆదివారం ఎగ్జిట్ ఫలితాలు వెలువడిన క్రమంలో ఎన్డీయే కి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్ని ఒకే తాటిపై వచ్చే క్రమంలో ప్రయత్నాలు చేస్తున్నాయి.  ఈ క్రమంలోనే బీజేపీయేతర పక్షాలను ఏకం చేసే పనిలో  చంద్రబాబు మమతా ను కలవనున్నారు. ఆమెతో భేటీ అనంతరం చంద్రబాబు కోల్ కతా నుండి ఢిల్లీకి వెళ్లనున్నారు.

Latest Updates