31 కేసులున్న వాడికి ఎవరైనా ఓటేస్తారా..? : చంద్ర‌బాబు

AP CM chandrbabu nayudu fires on Jagan

మ‌న ఇంటిని బ‌య‌టి వాళ్ల‌కి అద్దెకు ఇవ్వాలంటేనే.. ఒక‌టికి రెండు సార్లు ఆలోచిస్తామ‌ని,. అలాంటిది మ‌న ఓటు వేసే వ్య‌క్తి గురించి మ‌రెన్నో ర‌కాలుగా ఆలోచించాల‌ని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అన్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఈ రోజు ఆయ‌న‌ ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని పాలకొల్లులో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడుతూ.. మ‌న ఇంట్లో ఎదిగిన ఆడ‌పిల్ల‌కు పెళ్లి చేయాలంటే అనేక ర‌కాలుగా ఆలోచిస్తామ‌న్నారు. చేసుకోబోయే అబ్బాయికి చదువు-సంస్కారం, ఉద్యోగం… ఇవ‌న్నీ ఉంటేనే పిల్లనిస్తామ‌ని.. అలాంటిది రాష్ట్రాన్ని ఐదు సంవ‌త్స‌రాల పాటు పాలించే సీఎం అభ్య‌ర్ధి విష‌యంలో అన్ని అర్హ‌త‌లు ఉంటేనే ఓటేస్తామ‌ని ఆయ‌న అన్నారు. అవినీతి, అక్ర‌మాల్లో 31 కేసులున్న వాడికి, అరాచకాల పార్టీకి ఎవరైనా ఓటేస్తారా..? అంటూ ఈ సంద‌ర్భంగా ప్ర‌శ్నించారు. ఓటు వేసే ముందు ఎవ‌రికి వేస్తున్నామో తెల‌సుకొని రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాల‌ని చంద్ర‌బాబు అన్నారు.

Latest Updates