కుటుంబసభ్యులతో కలసి అమెరికా వెళ్లనున్న జగన్

అమరావతి:  ఏపీ సీఎం వైఎస్ జగన్ వచ్చే నెలలో అమెరికా టూర్‌కు వెళ్లనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వారం రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు జగన్. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జగన్ తొలిసారిగా అమెరికాకు వెళ్తున్నారు.  ఆగష్టు 17వ తేదీ నుండి 23వ తేదీవరకు అమెరికాలో పర్యటిస్తారు. ఈ నెల 17వ తేదీన అమెరికాలో నార్త్ అమెరికా తెలుగు కమ్యూనిటీ ఆహ్వాన సభలో ఆయన పాల్గొననున్నారు. ఆ తర్వాత డల్లాస్‌లో జరిగే కేబెల్లే కన్వెన్షన్ సెంటర్‌లో ప్రవాస భారతీయులు నిర్వహించే భారీ సభలో కూడా జగన్ పాల్గొంటారని సమాచారం.

Latest Updates