శ్రీవారి బ్రహ్మోత్సవాలకు జగన్ తోపాటు కర్నాటక సీఎం

ఈనెల 23న శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్

కర్నాటక గెస్ట్ హౌస్ శంకుస్థాపనలో పాల్గొననున్న ఇరువురు సీఎంలు

తిరుపతి: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల శ్రీవారి సన్నిధిలో జరిగే బ్రహ్మోత్సవాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప విచ్చేయనున్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సందర్భంగా రెండు రోజులు పాటు తిరుమలలోనే జగన్ ఉండనున్నారు. 23వ తేది సాయంత్రం తిరుమలకు సీఎం చేరుకుంటారని సమాచారం. గరుడ సేవ సందర్భంగా 23 సాయంత్రం శ్రీవారికి సీఎం జగన్ పట్టువస్ర్తాలను సమర్పించనున్నారు. 24న ఉదయం జగన్.. శ్రీవారిని దర్శించుకుంటారు. దర్శనాంతరం నాదనీరాజనం మండపంలో నిర్వహిస్తూన్న సుందరకాండ పారాయణంలో ఇద్దరు ముఖ్యమంత్రులు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. అనంతరం కర్నాటక అతిధి గృహం శంకుస్థాపన కార్యక్రమంలో ఇరువురు సీఎంలూ పాల్గొంటారు. ఆ తర్వాత తిరిగి పద్మావతి అతిథి గృహానికి చేరుకుని అల్పాహారం స్వీకరించిన అనంతరం జగన్ తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు.

 

 

 

Latest Updates