తక్కువ ధరకే ల్యాప్ టాప్ లు.. ప్రతీ గ్రామానికి ఇంటర్నెట్

పేద పిల్లలు కూడా పెద్ద చదువులు చదవాలనే లక్ష్యంతోనే అమ్మఒడిని ప్రారంభిచామన్నారు ఏపీ సీఎం జగన్. విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. నెల్లూరులో అమ్మఒడి పథకం రెండో విడతను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్.. తన  పాదయాత్రలో పేద విద్యార్థుల సమస్యలు కళ్లారా చూశామన్నారు. 44 లక్షల 48 వేల తల్లుల ఖాతాల్లోకి అమ్మఒడి పథకం నగదు జమ అవుతుందన్నారు. రెండో విడత అమ్మఒడికి రూ.6.773 కోట్లు కేటాయించామన్నారు. ప్రతీ విద్యార్థికి ఆత్మ స్థైర్యాన్ని నింపే కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. పిల్లల యోగక్షేమాలను గ్రామ వాలంటీర్లు చూసుకుంటారన్నారు.

9 నుంచి 12 విద్యార్థుల తల్లులకు మరో ఆప్సన్ ఇస్తామన్నారు. డబ్బులు వద్దనుకుంటే సాధ్యమైనంతవరకు తక్కువ ధరకే ల్యాప్ టాప్ లు ఇస్తామన్నారు. ల్యాప్ టాప్ లు పాడైతే వారం రోజుల్లో రీప్లేస్ చేస్తామన్నారు. వచ్చే మూడేల్లలో ఇంటర్నెట్ ను ప్రతీ గ్రామానికి  తీసుకెళ్తామన్నారు. ప్రతీ పేద విద్యార్థి పోటీ ప్రపంచంలో నిలబడేలా కార్యాచరణ రూపందిస్తున్నామన్నారు.అంగన్ వాడీ రూపురేఖలను మార్చేస్తామన్నారు. ఫిబ్రవరి 1 నుంచి అంగన్ వాడీ కేంద్రాల పేర్లు మారుస్తామన్నారు.

ఈ వారానికి ఇంతకు మించిన ఆరంభం ఇంకేముంది?

Latest Updates