ప్రతీ చేనేత కుటుంబానికి రూ.24 వేలు

మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి 24 వేల ఆర్థిక సాయం చేస్తామన్నారు సీఎం జగన్. అనంతపురం  ధర్మవరంలో వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించారు జగన్. ఈ సందర్బంగా మట్లాడిన ఆయన.. ధర్మవరం పట్టు వస్త్రాలు దేశానికే ఆదర్శమన్నారు. చేనేత కష్టాలు తెలుసు కాబట్టే వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. నేతన్న నేస్తం డబ్బులను పాత అప్పుల కింద జమ చేయవద్దని బ్యాంకర్లను ఆదేశించారు. బీసీలంటే వెనుకబడిన కులాలు కాదని.. సమాజానికే బ్యాక్ బోన్ అని అన్నారు.

జనవరి 9 నుంచి అమ్మ ఒడి పథకం అమలు చేస్తామన్నారు జగన్. ఉగాది రోజున 25 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తామన్నారు.  పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించామన్నారు. నాలుగు లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు చెందిన 81 శాతం మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు.

Latest Updates