తెలుగు ప్రజలకు ఏపీ సీఎం జగన్ దసరా శుభాకాంక్షలు

అమరావతి: రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి, దుష్ట శక్తుల మీద దైవ శక్తులు సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగ జరుపుకుంటున్నామని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చెడు ఎంత దుర్మార్గమైనదైనా.. ఎంత శక్తిమంతమైనదైనా.. అంతిమంగా విజయం మంచినే వరిస్తుందని మహిషాసురుడిపై జగన్మాత సాధించిన విజయం ప్రపంచానికి చాటిందని గుర్తు చేశారు.  జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని, ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు వరించేలా దుర్గామాత అందరినీ దీవించాలని కోరుకుంటూ.. తెలుగు ప్రజలందరికీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు.

 

 

Latest Updates