సంగమేశ్వరం కాదు.. పాలమూరే  కొత్త ప్రాజెక్టు

అపెక్స్ మీటింగ్ కు వచ్చి అన్ని విషయాలు చెప్తాం
కేంద్ర మంత్రి షెకావత్ కు ఏపీ సీఎం జగన్ లెటర్
సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్ స్కీం కొత్తది కాదని, తెలంగాణ చేపట్టిన పాలమూరు‑–రంగారెడ్డి ప్రాజెక్టే కొత్తదంటూ ఏపీ సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాశారు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కు వచ్చి తమ ప్రాజెక్టులపై పూర్తి సమాచారాన్ని ఇస్తామంటూ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు లెటర్ రాశారు.

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ నిర్మిస్తోన్న పాలమూరు – రంగారెడ్డి, డిండి లిఫ్ట్ఇరిగేషన్ ప్రాజెక్టులే కొత్తవని, వాటి కింద కొత్త ఆయకట్టు ఉందని ఏపీ సీఎం జగన్ తెలిపారు. సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్ స్కీం కొత్త ప్రాజెక్టు కాదన్నారు. బచావత్ అవార్డులోనే ఈ ప్రాజెక్టును ప్రస్తావించారని పేర్కొన్నారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి వచ్చి తమ ప్రాజెక్టులపై పూర్తి సమాచారాన్ని ఇస్తామంటూ మంగళవారం కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు ఆయన లెటర్ రాశారు. కేంద్ర మంత్రి నుంచి తనకు వచ్చిన లేఖకు సమాధానంగా ఈ లెటర్ రాస్తున్నట్టు జగన్ తెలిపారు.

ఈ నెల 5న అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేం దుకు తానురెడీ అయ్యానని చెప్పారు. నాలుగో తేదీనే తమ ఎజెండాను కేంద్ర జల శక్తి శాఖకు పంపామని, అయితే మీటింగ్ వాయిదా పడిందన్నారు. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల మేరకే నీటిని రాయలసీమ లిఫ్ట్ స్కీం ద్వారా తీసుకుంటామన్నారు. ఈ ప్రాజెక్టు కింద కొత్త ఆయకట్టు లేదని, ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులకు శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యు లేటర్ ద్వారా నీటిని తీసు కోవడం సాధ్యం కావడం లేదని తెలిపారు. శ్రీశైలం పూర్తిగా నిండి ఉన్నప్పుడే కెపాసిటీ మేరకు నీటిని తీసుకోగలమని, అందుకే 800 అడుగుల వద్దకొత్త లిఫ్ట్ స్కీంను ప్రతిపాదించామన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో 796 అడుగుల నుంచి 42 వేల క్యూ సెక్కుల నీటిని తరలించేలా తెలంగాణ ప్రాజెక్టులు చేపట్టిందని లేఖలో వివరించారు. అపెక్స్ మీటింగ్ కు హాజరై
పూర్తి వివరాలు అందజేస్తామని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం

Latest Updates