త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఘనంగా 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. కృష్ణా జిల్లా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించింది. వేడుకల్లో  సీఎం జగన్మోహన్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తర్వాత పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌.. రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో 13 శాఖల శకటాల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Latest Updates