ఏపీ రాజధానులుగా విశాఖ, అమరావతి, కర్నూల్ ..సంచలన ప్రకటన చేసిన సీఎం జగన్

రాష్ట్రానికి మూడు రాజాధానుల్ని నిర్మించే అవకాశం ఉందని సీఎం జగన్ అన్నారు. అసెంబ్లీలో అమరావతి నిర్మాణంపై చర్చ జరిగింది. చర్చ సందర్భంగా మాట్లాడిన జగన్ ..గత ప్రభుత్వం రాజధాని నిర్మాణం అంటూ ఖర్చును భారీగా పెంచేసిందన్నారు.

మొత్తం రాజధాని నిర్మాణం కోసం లక్షా 9వేల కోట్లును ఖర్చు చేయాల్సి ఉండగా..ఐదేళ్లలో రూ.5800కోట్లు ఖర్చు చేసిందన్నారు. దీంతో 700కోట్లు అదనంగా వడ్డీ కట్టాల్సి వస్తుందని జగన్ తెలిపారు. రాష్ట్రాభివృద్ధిలో భాగంగా ఉత్తరాంధ్రసుజల స్రవంతికి రూ.16వేల కోట్లు, తాగునీటి కోసం రూ.40వేల కోట్లు, పాఠశాలలు, ఆస్పత్రుల అభివృద్ధి కోసం రూ.30వేల కోట్లు, రాజధాని  పరిధిలో ఉన్న 20కిలోమీటర్ల మేర ఉన్న భూముల్ని అభివృద్ధి చేయాలంటే మొత్తం లక్ష కోట్ల నిధులు కావాలన్నారు. నిధులు కావాలంటే ప్రాంతాలవారీగా అభివృద్ధిని వికేంద్రీకరణ చేయాలని, అందుకోసం రాష్ట్రానికి మూడు రాజధానులు వచ్చే అవకాశం ఉందన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం వైజాగ్, అమరావతి, కర్నూల్ లో రాజధానుల్ని నిర్మించే దిశగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. కర్నూలులో  హైకోర్టు పెట్టొచ్చు… విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావొచ్చన్నారు.

నిర్మాణాలు చేపట్టాలంటే డబ్బులు ఉన్నాయా అన్న అంశంపై చర్చించాలన్నారు. ఈ అంశంపై ఓ కమిటీ వేసినట్లు.. వారంరోజుల్లో కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా మూడు రాజధానుల నిర్మాణంపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

Latest Updates