మహిళా మెడికో చెయ్యిలాగాడు : AP పోలీసు దురుసు ప్రవర్తన

వెస్ట్ గోదావరి జిల్లా : మల్కాపురం అల్లూరి సీతారామరాజు అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్-ASRAMSలో విద్యార్థినుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. సమ్మర్ సెలవులు ఇవ్వాలంటూ మహిళా మెడికోలు క్యాంపస్ లో ఆందోళన చేశారు. ఇదే సమయంలో… మఫ్టీలో ఉన్న ఓ పోలీస్(డ్రైవర్) తీరు వివాదాస్పదమైంది.

సమ్మర్ హాలీడేస్ ఇవ్వకుండా… తమను వేధిస్తున్నారంటూ మెడికోలు క్యాంపస్ లో ధర్నా చేశారు. ముఖాలకు మాస్కులు వేసుకుని నిరసన తెలిపారు. మేనేజ్ మెంట్ తీరుపై విమర్శలు చేశారు. మహిళా విద్యార్థులు ఆందోళనకు దిగడంతో.. మేనేజ్ మెంట్… పోలీసులను రప్పించింది. పోలీస్ అధికారులు విద్యార్థులతో మాట్లాడి సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నించారు. అక్కడికొచ్చిన పోలీసుల తీరు.. వివాదాన్ని మరింత పెద్దది చేసింది.

పోలీస్ ఉన్నతాధికారితో .. విద్యార్థినులు మాట్లాడుతున్న సమయంలో మఫ్టీలో ఉన్న ఓ పోలీస్.. తన సెల్ ఫోన్ లో యువతులను ఫొటోలు, వీడియో  తీసేందుకు ట్రై చేశాడు. ఫొటోలు తీయొద్దు అని ఓ యువతి హెచ్చరించింది. అతడి దగ్గరున్న ఫోన్ ను గుంజుకుంది. బలవంతంగా ఆమెనుంచి ఫోన్ ను తీసుకున్నాడు ఆ పోలీస్. ఫోన్ తీసుకుని.. ఆమెపైకి దూసుకెళ్లి.. చేతిని లాగి.. అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె చుట్టూ ఉన్న మెడికో అమ్మాయిలు ఆమెను అతడి నుంచి విడిపించేందుకు ప్రయత్నించారు. అక్కడ మహిళా పోలీసులు కూడా ఉన్నారు. మఫ్టీలో ఉన్న ఆ పోలీస్ ను కొందరు అక్కడినుంచి తీసుకుని వెళ్లిపోయారు. ఊహించని షాక్ తో.. విద్యార్థినులు ఏడుస్తూ.. నిరసన కొనసాగించారు.

ప్రొటెస్ట్ చేయొద్దనీ.. పోలీస్ కేసులు పెడతామని తమను యాజమాన్యం బెదిరించిందని విద్యార్థినులు చెప్పారు. అందుకే ముఖాలు కనపడకుండా ధర్నా చేశామన్నారు. ఇష్యూపై స్పందించిన ఏలూరు డీఎస్పీ.. పోలీసు తన ఫోన్ మాత్రమే తీసుకున్నాడనీ.. అక్కడ మహిళా పోలీసులు కూడా రక్షణగా ఉన్నారని చెప్పారు.

మెడికో అమ్మాయిలపై పోలీస్ దాడిని తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ – TJDA తప్పుపట్టింది. కాలేజీపైనా.. దురుసుగా ప్రవర్తించిన వారిపైనా చర్యలు తీసుకోవాలంటూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా-MCI ను డిమాండ్ చేసింది.

Latest Updates