ఏపీలో 20 లక్షలు దాటిన టెస్టులు.. కొత్తగా 9,276 కేసులు

  • 1,50,209కి చేరిన కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు 60,797 టెస్టులు చేయగా.. వారిలో 9,276 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని అధికారులు హెల్త్‌ బులిటెన్‌ రిలీజ్‌ చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 20,12,573 పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. 24 గంటల్లో 58 మంది వ్యాధి బారిన పడి చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 1407కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 76,614 మంది వ్యాధి నుంచి కోలుకోగా.. 72,188 మంది ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. తూర్పుగోదావరి, విశాఖల్లో ఎనిమిది మంది, గుంటూరులో ఆరుగురు, అనంతపూర్‌‌, చిత్తూరు, కర్నూలులో ఆరుగురు, శ్రీకాకుళంలో నలుగురు, కృష్ణ, పశ్చిమగోదావరిలో ముగ్గురు, నెల్లూరు, ప్రకాశం, విజయనగరంలో ఇద్దరు చనిపోయారు. కడపలో ఒకరు మరణించినట్లు అధికారులు చెప్పారు.

జిల్లాల వారీగా కేసుల వివరాలు

Latest Updates