ఏపీలో కొత్తగా 2,905 కేసులు..16 మంది మృతి

అమరావతి: ఏపీలో గడిచిన 24 గంటల్లో 2,905 మందికి క‌రోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయ్యిందని తెలిపింది రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు నిర్వ‌హించిన మొత్తం కరోనా టెస్టుల సంఖ్య  78,62,459కి చేరిందని.. గడిచిన 24 గంటల్లో 3,243మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారని చెప్పింది.  ఇప్ప‌టివ‌ర‌కు 784752 మంది క‌రోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారంది.  ప్ర‌స్తుతం 26268 యాక్టివ్ కేసులున్న‌ట్లు తెలిపిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ.. గడిచిన 24 గంటల్లో 16 మంది వైరస్ తో మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 6,659 కి చేరుకుందని చెప్పింది. అలాగే గడిచిన 24 గంటల్లో 88,778 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని తెలిపింది ఏపీ వైద్య ఆరోగ్య శాఖ.

 

 

Latest Updates