చంద్రబాబుకు ఝలక్..18 జీవోలు రద్దు చేసిన సీఎస్

ఏపీ సీఎం చంద్రబాబుకు రాష్ట్ర సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఝలక్ ఇచ్చారు. ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా పోలింగ్ తర్వాత ప్రభుత్వం జారీ చేసిన 18 జీవోలను రద్దు చేశారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సిఫార్సుతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో ఎల్వీ సుబ్రహ్మణ్యం రద్దు చేశారు. అలాగే చంద్రబాబు నిర్వహించే సమీక్షా సమావేశాలకు హాజరైన 16 మంది అధికారులు వివరణ ఇవ్వాలంటూ ఈసీ నోటీసులు జారీ చేసింది.

 

Latest Updates