1381 కిలోల టీటీడీ గోల్డ్ పై సీఎస్ విచారణ

టీటీడీకి చెందిన 1381 కిలోల బంగారం రవాణా వివాదంపై ఏపీ సీఎస్  ఎల్వీ సుబ్రహ్మణ్యం విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారంపై విచారణ అధికారిగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌ సింగ్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే తిరుపతికి వెళ్లి బంగారం రవాణాలో భద్రతా లోపాలపై విచారణ జరిపి ఈ నెల 23లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ వ్యవహారంలో టీటీడీ విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యంపైనా లోతుగా దర్యాప్తు చేయాలని సూచించారు సీఎస్.

 

Latest Updates