15న ఏపీ DSC- 2018 మెరిట్ లిస్ట్

విజయవాడ ఈనెల 15న DSC-2018 మెరిట్‌ లిస్టు విడుదల కానున్నట్లు తెలిపారు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు. మెరిట్‌ లిస్టు ఆధారంగా నియామకాలు చేపడతామన్నారు. మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు టెన్త్‌ పరీక్షలు నిర్వహించనునట్లు చెప్పారు. ఏప్రిల్‌ 27న టెన్త్‌ పరీక్ష ఫలితాలు విడుదలవుతాయని అన్నారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 18వరకు ఇంటర్‌ పరీక్షలు జరుగుతాయని, ఏప్రిల్‌ 12న ఫలితాలు విడుదల చేస్తామని చెప్పారు.

ఏప్రిల్‌ 19న ఏపీ ఈసెట్‌ పరీక్ష నిర్వహిస్తామని మే 30న ఫలితాలు విడుదల కానున్నట్లు తెలిపారు. వీటితో పాటు మరికొన్ని ప్రవేశ పరీక్షల తేదీలను, ఫలితాల తేదీలను మంత్రి గంటా ప్రకటించారు.

ఏప్రిల్‌ 20 నుంచి 24 వరకు ఎంసెట్‌ పరీక్షలు, మే 1న ఫలితాలు

ఏప్రిల్‌ 26న ఐసెట్‌, మే 3న ఫలితాలు

మే 1 నుంచి 4 వరకు ఏపీ పీజీసెట్‌, మే 11న ఫలితాలు

మే 6న ఏపీ ఎడ్‌ సెట్‌, మే 10న ఫలితాలు

మే 6న ఏపీ లా సెట్‌, మే 13న ఫలితాలు

మే 6 నుంచి 15వరకు ఏపీ పీఈ సెట్‌, మే 25న ఫలితాలు

 

Latest Updates