
అమరావతి: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి మాట తడబడ్డారు. డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా శ్రీవాణి సొంత జిల్లా విజయనగరం వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె మాట తడబడ్డారు.
“మా ముఖ్యమంత్రి ఒకటే లైన్తో వెళుతున్నారు. అవినీతి పాలన అందించాలన్నదే మా ప్రభుత్వ ధ్యేయం.” అని పుష్పశ్రీవాణి తడబడ్డారు. అయితే ఆమె పక్కనే ఉన్న నేతలు అలెర్ట్ చేయడంతో తప్పు తెలుసుకున్న డిప్యూటీ సీఎం మాటమార్చారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో నెటిజన్లు పెద్దఎత్తున కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.