AP ఎంసెట్-2019 : రేపటినుంచి ఆన్ లైన్ పరీక్షలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఎంసెట్‌-2019 నిర్వహణకు జేఎన్‌టీయూ- కాకినాడ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 20 నుంచి 24 వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు గంట ముందుగానే కేంద్రానికి హాజరు కావాలని ఎంసెట్‌ ఛైర్మన్‌ ఎం.రామలింగరాజు, కన్వీనర్‌ సీహెచ్‌ సాయిబాబు తెలిపారు.

ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. బయోమెట్రిక్‌ హాజరు తీసుకుంటున్నందున విద్యార్థులు గోరింటాకు, మెహందీ, ఏ ఇతర రంగులను చేతులకు పెట్టుకోకూడదని సూచించారు.

Latest Updates