అక్టోబర్ 23 నుంచి ఏపీ ఎంసెట్ వెబ్ కౌన్సిలింగ్

అమ‌రావ‌తి: రేపటి (అక్టోబర్ 23) నుంచి ఏపీ ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగానికి వెబ్ కౌన్సిలింగ్ జ‌ర‌గ‌నుంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వెబ్‌ కౌన్సిలింగ్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఉన్నత విద్యామండలి అధికారులు వెల్ల‌డించారు. ఇప్ప‌టికే ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఏర్పాట్లు చేశారు. ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో వెబ్ కౌన్సిలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 25 హెల్ప్‌లైన్‌ సెంటర్లను ఏర్పాటు చేయ‌గా, గిరిజన విద్యార్ధుల కోసం తొలిసారిగా పాడేరులో హెల్ప్‌లైన్‌ పెట్టారు.

అక్టోబ‌ర్ 23న  ఒకటో ర్యాంక్ నుంచి 20వేల వరకు వెబ్ కౌన్సిలింగ్

24న 20,001 ర్యాంక్ నుంచి 50వేల వ‌ర‌కు

25న 50,001 ర్యాంక్ నుంచి 80వేల వరకు

26న 80,001 ర్యాంక్ నుంచి 1.10లక్షల వరకు

27న 1,10,001 నుంచి చివరి ర్యాంక్‌ వరకు

Latest Updates