రాష్ట్రవ్యాప్త నిరసనలకు చంద్రబాబు పిలుపు

ఏపీలో కరెంట్ ఛార్జీలు పెంచడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తప్పుబట్టారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేపట్టాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలు మరియు నియోజకవర్గాల్లో నిరసనలు చేపట్టాలని ఆయన టీడీపీ నాయకులకు ఆదేశించారు. కరోనా వల్ల నాయకులందరూ ఇళ్లలోనే ఉంటూ దీక్షలు చేయాలని సూచించారు. ఒక పక్క లాక్డౌన్ వల్ల పనులు లేక.. తినడానికే ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. మూడు, నాలుగు రెట్లు విద్యుత్ ఛార్జీలు పెంచడమేంటని ఆయన ప్రశ్నించారు. ప్రజలు క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే కరెంటు బిల్లులు పెంచడం దారుణమని ఆయన అన్నారు. దేశంలోని డిస్కంలకు కేంద్ర ప్రభుత్వం రూ.90 వేల కోట్ల రాయితీలు ఇచ్చిందని ఆయన అన్నారు. ఎన్నికల ముందు ఓట్ల కోసం విద్యుత్ ఛార్జీలు పెంచమని హామీ ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి.. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాట తప్పి ఛార్జీలు పెంచడం దారుణమని ఆయన అన్నారు. టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని ఆయన గుర్తుచేశారు.

For More News..

పార్టీని బలోపేతం చేసే సత్తా సంజయ్ కి ఉంది

కేంద్ర ప్యాకేజీపై కేసీఆర్ మాట్లాడిన తీరు సరికాదు: కిషన్ రెడ్డి

లాక్డౌన్ లో సడలింపులు.. జనంతో నిండిన హైదరాబాద్ రోడ్లు

కిస్సింగ్ వీడియో వైరల్.. యువతుల్ని చంపేసిన కుటుంబసభ్యులు

Latest Updates