అఖిలప్రియ బెయిల్ పిటిషన్ రేపటికి వాయిదా

హైదరాబాద్: కిడ్నాప్ కేసులో అరెస్టయిన ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది. అఖిలప్రియ దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్ పై పోలీసులు కౌంటర్ దాఖలు చేయడంతో అసలు బెయిల్ వస్తుందా.. లేదా అన్న ఉత్కంఠ రేపింది. మరోవైపు ఆమె భర్త భార్గవ రామ్, సోదరుడు జగత్ విఖ్యాతరెడ్డిలు కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో.. ఈ మూడు పిటిషన్లపై విచారణను సికింద్రాబాద్ సెషన్స్ కోర్టు రేపటికి వాయిదా వేసింది. అఖిలప్రియతోపాటు… ఆమె భర్త, సోదరులకు బెయిల్ ఇవ్వొద్దంటూ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపధ్యంలో వీరికి బెయిల్ పై సందిగ్ధత కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి..

డ్రగ్స్ కేసులో అరెస్టయిన కన్నడ నటి రాగిణికి బెయిల్

అమ్ముడుపోని టిక్కెట్‌కు రూ. 12 కోట్ల లాటరీ

వైరల్ వీడియో: హలో.. నేను తేజస్వీ యాదవ్ మాట్లాడుతున్నా

చదువు మధ్యలో ఆపేస్తే పూర్తి ఫీజు కట్టాలా.?


Latest Updates